'జూలీ 2'లో బికినీలో అందాలను ఆరబోయనున్న లక్ష్మీ రాయ్
నేహా ధూపియా ప్రధాన పాత్రలో అప్పట్లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'జూలీ'. ఇందులో నేహా ధూపియా నగ్నంగా నటించి దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. నేహా ధూపియా సెమీన్యూడ్‌గా వచ్చిన ఈ ఫిల్మ్‌కి సీక్వెల్ రెఢీ అవుతోంది. దీనికి 'జూలీ-2' అని టైటిల్ కూడా పెట్టారు. అయితే ఇది సీక్వెల్ మాత్రం కాదట. ఇందులో హీరోయిన్‌గా నేహాకి బదులుగా లక్ష్మీరాయ్ కనిపించనుందట. ఇందులో లక్ష్మీరాయ్ న్యూడ్ లుక్‌తో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ కన్నడ సుందరికి ఇదే తొలి బాలీవుడ్ చిత్రం. తన తొలి బాలీవుడ్ సినిమా కావడంతో లక్ష్మీ రాయ్ అన్ని విధాలా తన టాలెంట్‌ను ప్రదర్శించి బాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నం చేస్తోంది. మరింత అందంగా కనిపించడానికి దాదాపు 15 కిలోల బరువు కూడా తగ్గిందట. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సిద్ధమవుతోందట.
దీపక్ శివదాసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, తాజాగా రిలీజ్ అయిన బికినీ స్టిల్స్‌లలో లక్ష్మీరాయ్ తన హృదయ అందాలను చూపిస్తూ యమా హాట్‌గా కనిపిస్తోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ ,అందాల ఆరబోతతో కనువిందు చేసినప్పటికి ఈ భామకు అనుకున్నంత ఇమేజ్ రాలేదు దాంతో మరిన్ని అందాలను ఆరబోస్తూ చేసిన ఈ ''జూలీ''పై చాలా ఆశలే పెట్టుకుంది. మరి రాయ్ లక్ష్మి ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే.