ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (12:34 IST)

రామ్ చరణ్- సాయిపల్లవికి వున్న లింకేంటి?

Sai Pallavi
ఆర్ఆర్ఆర్ తర్వాత, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆలస్యం చేయకుండా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇది శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఆ తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో చెర్రీ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమా ఎనౌన్స్ చేసి చాలా రోజులైంది. ఆ తర్వాత నాలుగేళ్లుగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. చరణ్ 16వ సినిమా కానున్న ఈ ప్రాజెక్ట్‌కి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.
 
ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తికర రూమర్. జాన్వీ కపూర్, కీర్తి సురేష్, రవీనా టాండన్ కూతురు రాషా టాండన్ పేరు వినిపించింది కానీ ఇప్పుడు కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరు సాయి పల్లవి. దర్శకుడు బుచ్చిబాబు ఎవరి అంచనాలకు మించి రామ్ చరణ్ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారు.
 
సాయి పల్లవి ఇప్పటి వరకు పెద్దగా కమర్షియల్ సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో ఆమె నటించలేదు. గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ పెద్ద స్టార్లు నటించే కమర్షియల్ చిత్రాలకు ఆమె సెట్ కాదనే అభిప్రాయం ఉంది. అయితే బుచ్చిబాబు కథానాయికగా సాయి పల్లవిని పరిశీలిస్తున్నారు. ఇందులో చరణ్ స్పోర్ట్స్‌మెన్ కోచ్‌గా కనిపిస్తాడని అంటున్నారు.