గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (16:02 IST)

ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన చరణ్, మహేష్ కుటుంబాలు

Ramcharan_Mahesh Babu
Ramcharan_Mahesh Babu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదు. అదే ఇప్పుడు జరిగింది. చరణ్, మహేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు. వీరిద్దరి కుటుంబాలు ఓ ప్రైవేట్ పార్టీలో ఇలా కలిశాయి. 
 
ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటోలో రామ్ చరణ్, మహేష్ బాబులతో పాటు ఉపాసన, నమ్రత, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఇందులో వారి పిల్లలు కనిపించడం లేదు. ఉపాసన తనకు ఇష్టమైన కుక్కపిల్లని తీసుకుని ఫోటోలకు పోజులిచ్చింది. 
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సైలెంట్‌గా ఉండే ఈ ఇద్దరు స్టార్స్ బయట మాట్లాడుకోవడం చాలా అరుదు. 
 
రామ్ చరణ్ అప్పుడప్పుడూ బయటకు కనిపిస్తున్నప్పటికీ, మహేష్ మాత్రం ప్రైవేట్ పార్టీల్లో కనిపించడం చాలా అరుదు. వీరిద్దరిని కుటుంబ సమేతంగా చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వరుణ్ తేజ్ పెళ్లిలో మెగా హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటో ఎలా వైరల్ అయిందో, ఈ ఫోటో కూడా వైరల్‌గా మారింది.
 
ఇటీవల వరుణ్, లావణ్యల పెళ్లి కోసం ఇటలీ వెళ్లిన చరణ్ మళ్లీ ఈ సినిమా షూటింగ్‌లో బిజీ కానున్నాడు. మరోవైపు సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్.