బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (11:30 IST)

హీరోలందరూ ఆ పనికోసమే అనుకునేదాన్ని అంటున్న అనసూయ

Anasuya
Anasuya
సినిమాకు హీరో హీరోయిన్లు ఎంతో ముఖ్యం. ఒక హీరో సినిమాకు సెట్ అయితే హీరోయిన్ కోసం వేట మొదలుపెడతారు. ఎక్కువగా హీరోల ఛాయిస్ వుంటుంది. అలా సినిమారంగంలో  ఎందరో హీరోలు తమకు కావాల్సిన హీరోయిన్లనే దర్శక నిర్మాతలకు చెప్పి ఓకే చేయించేవారు. యూత్ హీరోలు కూడా తమకు నచ్చిన హీరోయిన్ను సినిమాల్లో తీసుకోవాలని ట్రై చేస్తుంటారు. అలాగే ఓ హీరో అనసూయను అప్రోజ్ అయ్యాడట. కానీ ఆమె రిజక్ట్ చేసింది.
 
కారణం ఏమంటే, హీరోలందరూ లైనేయడానికే మనల్ని అప్రోచ్ అవుతారనుకుని, మొదట్లో వాళ్ళను అవాయిడ్ చేసేదాన్ని. అడవి శేష్ నన్ను గూఢచారికి అప్రోచ్ అయితే నేనే వద్దనుకున్నా. ఎందుకంటే హీరోయిలందరూ ఒకేలా ఆలోచిస్తారని అనుకునేదాన్ని. ఆ తర్వాత నా ఆలోచనను మార్చుకున్నానని ఇటీవలే ఓ వీడియోలో పేర్కొంది. 
 
తాజాగా ఓ కొటేషన్ కూడా పోస్ట్ చేసింది. నాకు చాలు. నాకిప్పుడు ఉన్నది చాలు.  నా దగ్గర ఉన్నది సరిపోతుంది. అంటూ.. జీవిత పాఠాలు చెబుతోంది. ఇప్పుడు అనసూయ పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.