శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (16:53 IST)

అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్ ల మధ్య పోటీ !

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj
నటి అనసూయ ఇప్పుడు హాట్‌ భామగా పేరుపొందింది. జబర్‌దస్త్‌ నుంచి సినిమాల్లోనూ వ్యాంప్‌ పాత్రలు చేసి ఆకట్టుకుంటుంది కూడా. రంగస్థలంలో రంగమ్మత్తగా ఎక్స్‌పోజింగ్‌ చేసిన అనసూయ ఇటీవలే విమానం అనే సినిమాలో వేశ్యగా నటించింది. ఎటువంటి పాత్రలోనైనా ఇమిడిపోయే విధంగా వున్న ఆమెను సీరియస్‌ రోల్‌లో నటించే అవకాశాన్ని ఛోటాకె.నాయుడు అందజేశారు. పెదకాపు1 సినిమాలో సీరియస్‌ రోల్‌ చేయడానికి అనుభమున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌కు అనుకున్నారట. ఆమె ఆల్‌రెడీ రవిజేత, గోపీచంద్‌ కాంబినేషన్‌లో సినిమా చేసింది. సీరియస్‌ పాత్రలకు  పెట్టింది పేరుగా వున్న ఆమె స్థానంలో షడెన్‌గా అనసూయ ప్రత్యక్షమయింది.
 
అందుకు కొన్ని సాంకేతిక కారణాలవల్ల వరలక్ష్మీని వద్దనుకున్నామని చిత్రయూనిట్‌ చెబుతోంది. కానీ అనసూయకు ఎప్పటినుంచో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తరహా పాత్రలు చేయాలనుందని పలువురు సన్నిహితులతో చెప్పింది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఛోటాకె. వెంటనే అనసూయకు ఫోన్‌ చేసి చెప్పాడట. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల నుంచి నీకు ఫోన్‌ వస్తుంది. నువ్వు ఎదురు చెప్పకుండా చేస్తానని ఒప్పుకో. అని చెప్పాడు. ఈ విషయాన్ని అటు ఛోటా. ఇటు అనసూయ కూడా చెప్పారు. అయితే ఇన్నర్‌గా ఒకరికి వెళ్ళాల్సిన పాత్ర అనసూయకు దక్కింది. ఇలా సినిమాలో పాత్రలు మారడం సహజమే అయినా అనసూయ కోరిక నెరవేరిందనే చెప్పాలి. ఆల్‌రెడీ పుష్పలో అనసూయ విలనీగా నటించింది. అది కూడా సెంటిమెంట్‌గా ఫీలయి దర్శకుడు అనసూయను తీసుకున్నాడని టాక్‌ కూడా వుంది.