గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (17:06 IST)

అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చేసింది

Allu Arjun Pushpa 2
Allu Arjun Pushpa 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ అందించింది. 
 
సోమవారం పుష్ప 2 విడుదల తేదీని ప్రకటించారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన వేర్ ఇస్ పుష్ప వీడియో సినిమాపై అంచనాలు పెంచింది.
 
నటీనటులు:అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు
టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ