1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (18:20 IST)

నాకు ఇన్‌స్పిరేషన్‌ మా టీచర్‌ అంబిక మేడమ్‌ : అల్లు అర్జున్‌

Allu arjun - teacher ambika
Allu arjun - teacher ambika
నేడు టీచర్స్‌ డే సందర్భంగా అల్లు అర్జున్‌ తన చిన్ననాటి గురువును తలచుకుంటూ ఆమె కాళ్ళకు నమస్కరిస్తూ ఆశీస్సులు తీసుకున్నారు. చెన్నైలో జరిగిన టీచర్స్‌ డే వేడుకల్లో ఆయన వీడియో బయటకు వచ్చింది. అందులో తనకు పాఠాలు చెప్పిన టీచర్‌ను సాదరంగా స్టేజీమీదకు ఆహ్వానించి వంగి కాళ్ళకు నమస్కరించారు. ఆమె మాట్లాడుతూ, అర్జున్‌ చిన్నప్పుడు చాలా హుషారు. ఎలాగంటే.. తన కాళ్ళకు డాన్స్‌ షూలు వున్నాయా! అన్నంతలా వుండేవాడు. చాలా చలాకీగా అర్జున్‌ వేస్తున్న డాన్స్‌ పిల్లలందరూ ఎంతో ఎంజాయ్‌ చేసేవారు అని గుర్తు చేసుకున్నారు.
 
Allu arjun - teacher ambika
Allu arjun - teacher ambika
అల్లు అర్జున్‌ స్పందిస్తూ.. మా టీచర్‌, గురువు అంబిక మేడమ్‌. 14 ఏళ్ళ స్కూల్‌ కెరీర్‌లో నేను బాడ్‌ స్టూడెంట్‌ను. నన్ను చాలాసార్లు ఇన్‌స్పైర్‌ చేసే విధంగా మాట్లాడేవారు. ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. డోన్‌ వర్రీ అర్జున్‌. ఎవ్రీ పర్సన్‌ హాజ్‌ గిఫ్ట్‌. ఆరోజు వస్తుంది. నువ్వు ఎక్కడికో వెళతావ్‌ అని ఆశీస్సులు అందించింది. అదేవిధంగా దయాగుణమే మనిషి జీవితాన్ని కాపాడుతుంది అని ఆమె చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. మా మేడమ్‌ చెప్పిన మాటలే నాకు స్పూర్తి అంటూ తెలిపారు.