సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (08:47 IST)

అనసూయ భరద్వాజ్ నటించిన ప్రేమ విమానం ఎలావుందంటే!

Prema Vimananam
Prema Vimananam
నటీనటులు: సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనసూయ భరద్వాజ్, అనిరుధ్ నామా, ‘వెన్నెల’ కిశోర్, అభయ్ బేతిగంటి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, కల్పలత తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల, నిర్మాత: అభిషేక్ నామా, దర్శకుడు : సంతోష్ కట్టా
 
ఇటీవలే  సముద్ర ఖని రూపొందించిన విమానం విడుదలైంది. ఇప్పుడు ప్రేమ విమానం విడుదల అయింది. ఇందులో  సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. మరి ఇదే ఎలా ఉండే తెలుసుకుందాం. 
 
కథ:
1990లో తెలంగాణలోని  ఓ పల్లెటూర్లో శాంతమ్మ (అనసూయ) తన భర్త ఇద్దరు పిల్లలు రామ్‌ లక్ష్మణ్‌(దేవాన్ష్‌ నామా, అనిరుథ్‌ నామా)లతో ఓ చిన్న గుడిసెలో ఉంటుంది. అత్తెసరు జీవితం వారిది. శాంతమ్మ చిన్న కొడుకు లచ్చు (అనిరుధ్ నామా)కు విమానంలో ప్రయాణించాలని బలమైన కోరిక ఉంటుంది. తండ్రికి చెపితే పంట డబ్బులు రాగానే చూద్దాం అంటాడు. కానీ తండ్రి షడన్ గా చనిపోతాడు. ఆతర్వాత పిల్లలు తల్లికే తెలియకుండా డబ్బులు తీసుకొని విర్మాణం కోసం హైదరాబాద్ వస్తారు. మరోవైపు మణి (సంగీత్ శోభన్) పల్లెటూరిలో చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉంటారు. ఊరి సర్పంచ్ కూతురు అభిత (శాన్వీ మేఘన)తో మణి ప్రిమిస్తాడు. పెద్దలు ఒప్పుకోరని ఇద్దరూ లేచిపోతారు. ఈ క్రమంలో వీళ్ళు పడిన ఇబ్బందులు ఏమిటి ?, చివరకు ఈ రెండు కథల్లోని లింక్ ఏమిటి. చివరికి ఏమైంది. అనేదే సినిమా. 
 
సమీక్ష: 
 
రెండు వేరువేరు కథలు కావడం రెండు గోల్స్ వంటి అంశాలను లింక్ చేస్తూ సినిమా ఉంది. పిల్లలు కథ ఇటీవలే వచ్చిన విమానం గుర్తు వస్తుంది. పాయింట్  ఒకటే అయినా సన్నివేశాలు వేరుగా ఉంటాయి. ఇందులో రైతు ఆత్మహత్యలు, తల్లి పడే కష్టాలు అన్ని కామన్ మాన్ ను టచ్ చేస్తాయి. ఎంటెర్టైమ్నెట్ గా పిల్లలు స్కూల్ టీచర్ వెంన్నెల కిశోరె ఎపిసోడ్ ఉంటుంది. 
 
ఇద్దరు పిల్లలు దేవాన్ష్‌ నామా, అనిరుథ్‌ నామా  బాగా నటించారు. ముఖ్యంగా అనిరుథ్‌ నామా నటన చాలా బాగుంది. విమానంలో ప్రయాణించాలనే కోరికతో పిల్లలు చేసే ప్రయత్నాలు.. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. మరోవైపు మణిగా సంగీత్ శోభన్ నటన సినిమాకి ప్లస్ అయింది. మణి తండ్రి పాత్రలో గోపరాజు రమణ జీవించారు.శాంతమ్మ గా అనసూయ గుర్తుండే విధంగా చేసింది. హీరో హీరోయిన్ల ప్రేమ కథలోని ఫీల్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇతర పాత్రల్లో ‘అభయ్, సురభి ప్రభావతి, కల్పలత తో పాటు మిగిలిన వారూ  తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
 
దర్శకుడు సంతోష్ కట్టా కథనాన్నిమరింత ఆకట్టుకునేలా తెస్తే బాగుండేది.  కీలకమైన సన్నివేశాలు బాగా తీసినా .మిగిలిన చోట్ల  స్లోగా నడిపారు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా సింపుల్ గా సాగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుంది.. అనేలా క్రియేట్ చేస్తే బాగుండేది. సినిమా ఫస్టాఫ్ కథనం కూడా సాదా సీదాగానే గడిచిపోగా సెకండ్ హాఫ్ కథనం కొన్ని చోట్ల, మరింత నెమ్మదిగా సాగుతుంది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాత అభిషేక్ నామాను అభినందించాలి.ఫీల్ గుడ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్, కొన్ని లవ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. చిన్నపాటి లోపాలున్నా ఫామిలీ తో చూసే సినిమా ఇది. 
రేటింగ్: 2.5/5