ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (14:03 IST)

పవన్ కళ్యాణ్‌ను దేవుడనే నమ్ముతాను : రాంగోపాల్ వర్మ కాంట్రవర్సీ ట్వీట్

హీరో పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. తాను పవన్ కళ్యాణ్‌ను ఎపుడు కూడా దేవుడనే నమ్ముతానంటూ అందులో పేర్కొన్నారు. 'నాకు మొక్కలంటే ప్రేమ' అంటూ పవన్

హీరో పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. తాను పవన్ కళ్యాణ్‌ను ఎపుడు కూడా దేవుడనే నమ్ముతానంటూ అందులో పేర్కొన్నారు. 'నాకు మొక్కలంటే ప్రేమ' అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై వర్మ పైవిధంగా కామెంట్స్ చేశారు. 
 
అంతేకాదండోయ్ తాను ఎల్లవేళలా దేవుడిగా నమ్మే పవన్‌ను తిరుపతి వెంకన్న, యాదగిరిగుట్ట నరసింహస్వామి, భద్రాచలం రాముడు తదితర దేవుళ్లనంతా పవన్ కల్యాణ్‌తో భర్తీ చేయాలని వర్మ ఆ ట్వీట్‌లో కోరాడు. 
 
కాగా, పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన కొత్త చిత్రం కాటమరాయుడు. ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రి రిలీజ్ ఫంక్షన్ ఇటీవలే జరిగింది. ఈ చిత్రం విడుదల తర్వాత రాంగోపాల్ వర్మ ఎలాంటి ట్వీట్స్ చేస్తారో వేచి చూడాల్సిందే.