బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (18:55 IST)

మీనాక్షి చౌదరితో ఖిలాడిలో మాస్ మహారాజ లిప్ లాక్?

Raviteja
సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ క‌ల్యాణ్‌ లాంటి స్టార్ హీరోలు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. తాజాగా రామ్ పోతినేని కూడా ‘రెడ్‌’తో ఆ జోన్‌లోకి వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు మాస్‌ మహా రాజా రవితేజ కూడా ఇంగ్లీష్‌ ముద్దు పెట్టబోతున్నాడట.

‘క్రాక్‌’ సూపర్‌ హిట్‌ తర్వాత రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ మినాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతోంది. ‘ఖిలాడి’లో రవితేజ ఒక లిప్‌లాక్‌ సీన్‌లో నటించారట. బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరితో కలిసి ముద్దు సనివేశంలో నటించారట మాస్‌ మహారాజా. ఈ సీన్‌ షూటింగ్‌ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. 
 
వాస్తవానికి లిప్‌లాక్‌ సీన్‌ చేయడానికి రవితేజ మొదట్లో ఒప్పుకోలేదట. కానీ, డైరెక్టర్‌ రమేశ్‌ వర్మ చాలా కష్టపడి రవితేజను ఒప్పించాడట. ఇష్టంలేకున్నా దర్శకుడి బలవంతం మేరకు లిక్‌లాక్‌ సీన్‌కు రవితేజ అంగీకరించాడట. మొత్తానికి మాస్‌ మహారాజా కూడా ఇంగ్లీష్‌ ముద్దు ఇచ్చి ఫ్యాన్స్‌కి మంచి కిక్‌ ఇచ్చేశాడన్నమాట.