హీరో రవితేజ - గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వచ్చిన మూవీ క్రాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'డాన్ శీను', 'బలుపు' వంటి చిత్రాలు వచ్చాయి. ఇపుడు ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ప్రతి ఒక్కరిలోనూ అమితాసక్తి నెలకొంది. వీరి కలయికలో సినిమా రూపొందడం ఒకటైతే. మరో విషయం... కోవిడ్.. థియేట్స్ అన్‌లాక్ నేపథ్యంలో విడుదలైన తొలి స్టార్ హీరో సినిమా 'క్రాక్'.