శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (11:36 IST)

క్రాక్ షోలు నిలిచిపోయాయ్.. కారణం ఏంటంటే?

మాస్ మహరాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం క్రాక్. ఈ సినిమా నేడు విడుదలకు సిద్దమయింది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో ఈ సినిమా హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల క్రాక్ షోలు నిలిచిపోయాయి. దాంతో సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశ చెందారు. ఎందుకు ఏంటనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
 
ఈ సినిమాలో రవితేజా పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించి అలరించనున్నాడు. అంతేకాకుండా దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత అందాల రాసి శ్రుతి హాసన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి నేడు ఈ సినిమా షో ఆగిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.