Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం..వ‌ర్మ‌..! అలా అనుకుంటే ఇలా జరిగిందట...

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ఆఫీస‌ర్. ఈ సినిమా ఎంత‌టి ప‌రాజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా రిలీజైన మూడు రోజుల‌కే థియేట‌ర్స్ నుంచి తీసేసారంటే.. సినిమా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇది అటు నాగ్ ఇటు

Written By Srinivas
Updated: శనివారం, 9 జూన్ 2018 (13:43 IST)
వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ఆఫీస‌ర్. ఈ సినిమా ఎంత‌టి ప‌రాజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా రిలీజైన మూడు రోజుల‌కే థియేట‌ర్స్ నుంచి తీసేసారంటే.. సినిమా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇది అటు నాగ్ ఇటు వ‌ర్మ ఇద్ద‌రికీ గ‌ట్టి షాకే. అయితే... వ‌ర్మ ఈ సినిమా చేయ‌డానికి కార‌ణం ఏంటంటే... బాగా అప్పుల్లో ఉన్నాడ‌ట‌. 
 
నాగార్జున‌తో సినిమా చేస్తే... క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. అప్పులు అన్నీ తీరుపోతాయ్ అనుకున్నాడ‌ట‌. త‌ను ఒక‌టి త‌లిస్తే... దేవుడు మ‌రొక‌టి త‌లిచాడ‌ట‌. అలా...వుంది వ‌ర్మ ప్ర‌స్తుత ప‌రిస్థితి. అప్పులు నుంచి బ‌య‌ట ప‌డ‌చ్చు అని నాగార్జున‌తో సినిమా చేస్తే.... అప్పులు తీర‌క‌పోగా.. ఈ సినిమా వ‌ల్ల కొత్త అప్పులు వ‌చ్చిప‌డ్డాయ‌ట‌. దీంతో వ‌ర్మ‌కి ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ట‌. 
 
ఆఫీస‌ర్ రిజెల్ట్ చూసిన త‌ర్వాత వ‌ర్మ‌తో సినిమా తీయ‌డానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాడు. మ‌రి... ఇప్పుడు వ‌ర్మ ఏం చేస్తాడు..? ఎలా అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాడు అనేది స‌మాధానం లేని ప్ర‌శ్న లాంటిది అంటున్నారు. పాపం...వ‌ర్మ‌..!

అన్నీ చూడండి

బీఆర్ఎస్ కార్యకర్తలు బంగారు గొలుసు చోరీ చేస్తరాని హరీశ్ రావు ఏం చేశారో చూడండి (వీడియో)

KCR: త్వరలో కేసీఆర్ పాదయాత్ర చేపట్టే అవకాశం వుందా?

తెలంగాణ అసెంబ్లీ వద్ద దుశ్శాసనపర్వం జరిగిందంటున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

నిశ్చితార్థం జరిగింది.. కానీ పెళ్లి ఆగిపోయింది... అయినా వెంటపడి... హెల్మెట్‌తో దాడి.. ఆపై?

మహిళ కడుపులో 14 పెన్నులు - 5 చెక్క స్పూన్లు

అన్నీ చూడండి

ఎంజీఎం హెల్త్‌కేర్‌లో తొలిసారి స్పైనల్ కార్డ్ స్టిమ్లుయేషన్

గర్భిణీ స్త్రీలు చిలకడ దుంపలు తినవచ్చా?

హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు

క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స

డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్

తర్వాతి కథనం
Show comments