ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (17:25 IST)

ఖైదీతో స్టెప్పులేసిన రత్తాలుకు కష్టాలు.. ఐటమ్ గర్ల్‌గా ఆపర్ల వెల్లువ.. హీరోయిన్ కెరీర్ ఓవరా?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో ఐటమ్ సాంగుకు చిందులేసిన రాయ్ లక్ష్మీ కెరీర్ అవుట్ కానుందా? ఇందుకు ఆమెకు వచ్చే ఐటమ్ సాంగ్సే కారణమా? అనే ప్రశ్నలకు సినీ పండితులు అవుననే సమాధానమిస్తున్నారు. పవర్ స్టార్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో ఐటమ్ సాంగుకు చిందులేసిన రాయ్ లక్ష్మీ కెరీర్ అవుట్ కానుందా? ఇందుకు ఆమెకు వచ్చే ఐటమ్ సాంగ్సే కారణమా? అనే ప్రశ్నలకు సినీ పండితులు అవుననే సమాధానమిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సర్దార్ గబ్బర్ సింగ్‌లో స్టెప్పులేశాక.. రాయ్ లక్ష్మీకి చిరంజీవితో చిందులేసేందుకు మంచి ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ రాగానే ఎగిరి గంతేసిన రాయ్ లక్ష్మీ ప్రస్తుతం బాధపడుతోందట. 
 
హీరోయిన్‌గా రాయ్ లక్ష్మీకి దక్షిణాదిన మంచి గుర్తింపే వుంది. ఎన్ని ఐటమ్ సాంగ్స్ చేసినా అమ్మడు హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేస్తోంది. అయితే ప్రస్తుతం ఖైదీ పాటకు డ్యాన్సులేశాక రాయ్‌లక్ష్మిని ఐటెంసాంగ్స్‌ చేయాల్సిందిగా నిర్మాతలు క్యూ కడుతున్నారట. పారితోషికం ఎంత కావాలంటే అంత.. ఎందుకు..? హీరోయిన్ల కంటే ఎక్కువే ఇస్తామంటున్నారట. 
 
ఈ డిమాండ్‌ రాయ్‌లక్ష్మీ ఓ వైపు సంతోషాన్నిచ్చినా.. హీరోయిన్‌ ఆఫర్లు సన్నగిల్లి కెరీర్‌కు కష్టాలు ఏర్పడుతాయోనని అమ్మడు బాధపడుతోంది. అంతేగాకుండా.. ఐటమ్ గర్ల్‌గా ముద్రపడిపోతే.. హీరోయిన్‌గా కెరీర్‌ ముగిసిపోతోందేమోనన్న భయం రాయ్‌లక్ష్మిని వెంటాడుతోందట. ఇలాంటి తరుణంలో డబ్బుకోసం ఐటెంసాంగ్స్‌ చేయాలా? లేక హీరోయిన్‌గా కెరీర్‌ కోసం డబ్బును వదులుకోవాలా? అనే రాయ్ లక్ష్మీ తేల్చుకోలేకపోతుందట. మొత్తానికి ఖైదీ రిలీజ్‌తో రాయ్ లక్ష్మీకి కొత్త కష్టాలు వచ్చాయట. అయితే సినీ పండితులు మాత్రం రాయ్ లక్ష్మీ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ పోతే మంచిదే అంటున్నారు. మరి ఆమె ఏం చేస్తుందో..?