బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (14:23 IST)

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కుమార్తె?

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ సారాను బాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారట.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ సారాను బాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారట.
 
సినిమా రంగంలోకి రావాలని సారాకి చిన్నప్పటి నుంచి కోరిక ఉండేదట అందుకు ఇదే సరైన సమయమని భావించిన ఆమీర్‌ ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. 
 
అంతేకాదు.. ఆమె తొలి సినిమాలోనే రణ్‌బీర్‌ కపూర్‌తో కానీ రణ్‌వీర్‌ సింగ్‌తో కానీ కలిసి పనిచేయనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం సారా ధీరూబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకుంది. 
 
అదేసమయంలో ఇటీవలికాలంలో తల్లిదండ్రులు సచిన్‌, అంజలితో కలిసి సారా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. సమాజ సేవలు చేయడంలోనూ సారా ఎప్పుడూ ముందుంటుంది.