మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:41 IST)

షూటింగ్‌లో ఆ హీరోను అన్నా అని పిలిచిన సాయిపల్లవి...?

తాను నటించే సినిమాల్లో తనతో పాటు పనిచేసే వారిని కుటుంబ సభ్యులుగా భావించడం హీరోయిన్ సాయిపల్లవికి ఉన్న అలవాట. ఫిదా సినిమాతో టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోయిన సాయిపల్లవి ఆ తరువాత ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే కొన్ని సినిమా షూటింగ్‌ల సమయంలో ఆమెపై హీరోలు గొడవ పడటం.. డైరెక్టర్లతో సాయిపల్లవి గొడవ పడటం ఆ తరువాత సద్దుమణగడం లాంటివి ఎన్నో జరిగాయి.
 
అయితే షూటింగ్‌లో తనకు ఎవరైనా బాగా దగ్గరైతే వారిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా సంబోధిస్తూ మాట్లాడుతుంటారు సాయిపల్లవి. యువ నటుడు శర్వానంద్, సాయిపల్లవి కలిసి నటించిన సినిమా పడిపడి లేచె మనస్సు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అయితే షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు సాయిపల్లవి. 
 
శర్వానంద్ నాకు బాగా నచ్చాడు. అందుకే షూటింగ్ సమయంలో నేను అన్నా అని పిలిచాను. శర్వానంద్ ఏమీ అనుకోలేదు. నాకు అతన్ని చూస్తే నా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కనిపిస్తున్నాడు. అందుకే అలా అనాల్సి వచ్చిందని స్నేహితులు చెప్పిందట సాయిపల్లవి. శర్వానంద్ కూడా సాయిపల్లవిని చెల్లెలుగానే భావించాడట. శర్వానంద్, సాయిపల్లవిలకు మధ్య ఏడు సంవత్సరాల తేడా ఉందట.