సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (16:05 IST)

అన్నయ్యకు తమ్ముడి భార్యంటే ఇష్టం.. తమ్ముడికి వదినంటే ఇష్టం.. ఏం చేశారంటే?

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అన్నాదమ్ములు తమ భార్యలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పనికిమాలిన పనికి ఓ నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, బిజ్నోర్‌కు చెందిన సోదరులు విశాల్.. యోగేంద్రలకు వివాహమైంది. విశాల్ లక్ష్మి అనే యువతిని, యోగేంద్ర సోనూ అనే యువతిని పెళ్లాడాడు. 
 
పెళ్లైన తర్వాత వీరి బుద్ధులు మారాయి. తమ్ముడి భార్య సోనుపై విశాల్‌ కన్నేశాడు. అలాగే యోగేంద్ర కూడా వదిన లక్ష్మి అంటే ఇష్టపడ్డాడు. దీంతో ఇద్దరూ భార్యలను మార్చుకోవాలనుకున్నారు. కానీ ఇందుకు విశాల్ భార్య లక్ష్మి అంగీకరించలేదు. 
 
దీంతో ఆవేశానికి గురైన విశాల్.. సోను తనకు దక్కకుండా పోతుందనే విరక్తిలో తమ్ముడు యోగేంద్రతో కలిసి లక్ష్మిని హతమార్చాడు. ఈ ఘటన స్థానికలంగా కలకలం రేపింది. పోలీసులు రంగంలోకి దిగి..సోదరులిద్దరినీ హతమార్చారు.