ఏడాదిపాటు సింగిల్‌గానే వుంటానంటున్న సమంతా... అప్పటివరకూ కుజదోషం?
నాగ చైతన్య, సమంతా ప్రేమ .. పెళ్లి వ్యవహారం త్వరలో ఫుల్స్టాప్ పడుతుందని భావించారు. నాగార్జున కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు డిసెంబర్లో బాజాబజంత్రీలు మోగనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్గా సమంతా ఒక ట్విస్ట్ ఇచ్చింది. తాను ఏడాది వరకూ
నాగ చైతన్య, సమంతా ప్రేమ .. పెళ్లి వ్యవహారం త్వరలో ఫుల్స్టాప్ పడుతుందని భావించారు. నాగార్జున కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు డిసెంబర్లో బాజాబజంత్రీలు మోగనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్గా సమంతా ఒక ట్విస్ట్ ఇచ్చింది. తాను ఏడాది వరకూ సింగిల్ గానే ఉండాలని నిర్ణయించుకున్నాననీ .. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని ఆమె ఒక మీడియా ప్రతినిధికి స్పష్టమైన సంకేతాలు పంపినట్టుగా చెప్పుకుంటున్నారు.
ఫిలింనగర్లో ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒక్కసారిగా ఆమెలో మార్పు ఎలా వచ్చింది? దీని వెనుక ఏమైనా కారణముందా? అనే రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏడాది వరకూ ఆమెను పట్టుకున్న కుజదోషం వదలన్నందువల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నదా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.