మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (22:14 IST)

స‌మంత అక్కినేని గ్లామర్ దాచుకోకుండా వదిలేసింది, ఎలా అంటే? (video)

Samantha Hot look, today
స‌మంత అక్కినేని వారంవారం స‌రికొత్త లుక్‌తో ద‌ర్శ‌న‌మిస్తుంటుంది. అందులో అభిమానుల‌కు షాక్ ఇచ్చేవయితే, యువ‌త‌కు హుషారెత్తించేవిగా వుంటాయి. గ్లామ‌ర్ ఏమాత్రం దాచుకోకుండా ఇలా ఫొటోలు ఇవ్వ‌డం ఆమెకు మామూలే. ఇటీవ‌లే స‌రికొత్త లుక్‌తో త‌న సోష‌ల్‌మీడియాలో పెట్టుకుంది. సినిమాల‌తో పాటు వెబ్ షోలు కూడా చేస్తుంది. ఇటీవ‌లే సామ్‌జాన్ అనే ఎపిసోడ్‌తో ప‌లువురు సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. అది పెద్ద‌గా విజ‌య‌వంతం కాలేద‌నే చెప్పాలి.

ఈసారి ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్‌లో నటిస్తున్న సామ్ ఈ సిరీస్ పైన చాలా న‌మ్మ‌కాన్ని పెట్టుకుంది. ఇందులో సమంతది చాలా ఇంపార్టెంట్ పాత్రని తెలిసింది. ఈ సిరీస్ షూటింగ్ పూర్తయి త్వరలో విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో తనదైన శైలిలో ప్రమోషన్ కూడా చేసేందుకు రెడీ అయింది. ఈ నెలలోనే ఈ రెండో సీరీస్ విడుదల కానుంది. ఈ లోగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటుందా అన్న‌ట్లు గ్లామ‌ర్‌గా క‌న్పిస్తుంది.
 
ఇదిలా వుండ‌గా, ఈరోజు స‌మంత నెట్ ఫ్లిక్స్‌లో రాబోతున్న పిట్ట క‌థ‌లు ట్రైల‌ర్ చూసి స్పందించింది. ది వెరీబెస్ట్‌.. ది లుక్స్ సో కూల్‌.. అంటూ కామెంట్ చేసింది. ట్రైల‌ర్‌లో ల‌స్ట్‌, ప్రేమ‌, ఎక్స్ లైఫ్‌, బ్రేక‌ప్‌, రొమాన్స్ డైలాగ్స్‌తో పాటు స‌న్నివేశాలు కూడా వున్నాయి. అయితే అందులో లక్ష్మీమంచు పాత్ర కీల‌క‌మైంది. ఆమె పాత్ర మిగిలిన‌వారిని చైత‌న్య‌ప‌రిచేదిగా వుంది. మ‌రి ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఎంత ఆద‌ర‌ణ పొందుతుందో చూడాల్సిందే.