గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 4 మే 2017 (13:45 IST)

'బాహుబలి' థియేటర్‌లో సమంతకు చేదు అనుభవం.. సినిమా చూడకుండానే బయటకు...

త్వరలోనే అక్కినేని ఇంటికోడలు కాబోతున్న హీరోయిన్ సమంతకు అవమానం జరిగింది. అదీ కూడా 'బాహుబలి 2' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్‌లో. దీంతో ఆమె 'బాహుబలి' సినిమాను చూడకుండానే కేవలం 20 నిమిషాల్లోనే తిరిగి

త్వరలోనే అక్కినేని ఇంటికోడలు కాబోతున్న హీరోయిన్ సమంతకు అవమానం జరిగింది. అదీ కూడా 'బాహుబలి 2' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్‌లో. దీంతో ఆమె 'బాహుబలి' సినిమాను చూడకుండానే కేవలం 20 నిమిషాల్లోనే తిరిగి వెళ్లిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఇటీవల సమంత తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ వేడుకల్లోభాగంగా ఆమె కొంతమంది అనాథ పిల్లలతో కలిసి బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌కు వెళ్లింది. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో నూన్‌షో తిలకించేందుకు వెళ్లింది. థియేటర్‌లోకి వెళ్లి కూర్చొన్న తర్వాత సమంతకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె జస్ట్ 20 నిమిషాల్లోనే థియేటర్ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. 
 
దీనికి కారణం ఏంటో తెలుసా? సమంత వెళ్లిన థియేటర్‌లో ఏసీ పనిచేయలేదట. సినిమా ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఏసీ ట్రబుల్ ఇచ్చిందట. ఎంతైనా హీరోయిన్ కదా... ఉక్కపోత తట్టుకోలేక 20 నిమిషాల్లోనే బయటికొచ్చేసినట్లు తెలిసింది. చిన్నారులు మాత్రం ఆ ఉక్కపోతలోనే సినిమాను వీక్షించారని సమాచారం. సినిమా ప్రమోషన్‌లో ఉన్న బాహుబలి 2 టీంకు, ఈ విషయం బయటికి పొక్కేసరికి కొంత ఇబ్బందిగా ఉందట. థియేటర్ యాజమాన్యం కలిగిన అసౌకర్యానికి సమంతకు క్షమాపణలు కూడా చెప్పినట్లు సమాచారం.