షాకింగ్.. మహేష్ మూవీ టైటిల్ 'రెడ్డీస్'... ఇదైతేనా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సంచలన చిత్రం మహర్షి రికార్డు స్ధాయి కలెక్షన్స్‌తో సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. విడుదలైన అన్ని ఏరియాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ సక్సస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే నెలలో ఈ సినిమాని ప్రారంభించనున్నారు.
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ టైటిలే కన్ఫర్మ్ చేస్తారు అనుకున్నారు కానీ.. మహేష్‌కి మూడక్షరాల సెంటిమెంట్ ఉంది. అందుచేత టైటిల్ మూడక్షరాల్లో ఉండాలని అనిల్ రావిపూడికి మహేష్ చెప్పినట్టు టాక్ వచ్చింది.
ఏ టైటిల్ పెడతారా అనుకుంటే.. ఇప్పుడు తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఆ టైటిల్ ఏంటంటే... రెడ్డి గారి అబ్బాయి. అవును... ఈ టైటిల్ అనుకుంటున్నారట. ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట.
అందుకనే రెడ్డిగారి అబ్బాయి అనే టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు... ఎటూ మహేష్ బాబుకి మూడక్షరాల సెంటిమెంట్ వుంది కనుక 'రెడ్డీస్' అని పెట్టే అవకాశం వుందంటున్నారు. ఒకవేళ ఈ సినిమాకి ఈ టైటిలే కనుక కన్ఫర్మ్ చేస్తే... షాకింగే!