ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (15:56 IST)

సినిమాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు అక్కడ మాత్రం పిసినారులు... సింగర్ ప్రణవి

రూ.కోట్లు ఖర్చు పెట్టి చిత్రాలను తీసే నిర్మాతలు.. గాయనీగాయకులకు పారితోషికం ఇచ్చేవిషయంలో మాత్రం పిసినారులుగా మారిపోతున్నారని సినీ గాయని ప్రణవి వాపోయారు. సినిమాల్లో పాటలు పడితే వచ్చే డబ్బులు కంటే.. టీవీ

రూ.కోట్లు ఖర్చు పెట్టి చిత్రాలను తీసే నిర్మాతలు.. గాయనీగాయకులకు పారితోషికం ఇచ్చేవిషయంలో మాత్రం పిసినారులుగా మారిపోతున్నారని సినీ గాయని ప్రణవి వాపోయారు. సినిమాల్లో పాటలు పడితే వచ్చే డబ్బులు కంటే.. టీవీ సీరియల్స్‌లో పాడేపాడే పాటలకే రెట్టింపు పారితోషికం ఇస్తున్నారని ఆమె పేర్కొంది. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ... 'ఇప్పటి సింగర్స్‌కు ఒక్కో పాటకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. వెయ్యి రూపాయలకు, రెండు వేలకు కూడా పాడమని అడుగుతుంటారు కొంతమంది నిర్మాతలు. అయితే ఉచితంగా పాడటానికి కూడా ఎంతో మంది సింగర్స్‌ సిద్ధంగా ఉన్నారు. సినిమాల కంటే సీరియల్స్‌, జింగిల్స్‌కు పాడినపుడే ఎక్కువ డబ్బులు వస్తాయి. సీరియల్‌కు పాడినప్పుడు రూ.30 వేలు వస్తే.. సినిమాకు పాడినపుడు రూ.ఐదు వేలే ఇస్తున్నారు. అయితే తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘పెళ్లిచూపులు’ సినిమాకు మాత్రం నాకు 15 వేల రూపాయలు ఇచ్చారని తెలిపారు.