బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (13:13 IST)

అవును.. దక్షిణాది సినీ పరిశ్రమ వరస్ట్.. ఓ నిర్మాత నన్ను కూడా: రాధికా ఆప్టే

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మహిళలపై ఎక్కడపడితే అక్కడ లైంగిక వేధింపులు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. హీరోయిన్లపై లైంగిక దాడులు, వేధింపులు ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ఇటీవల ఓ స

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మహిళలపై ఎక్కడపడితే అక్కడ లైంగిక వేధింపులు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. హీరోయిన్లపై లైంగిక దాడులు, వేధింపులు ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ఇటీవల ఓ సినీనటి కిడ్నాప్ లైంగిక వేధింపులకు గురై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా బోల్డ్ నటి రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్న దృశ్యాల్లో నటిస్తూ బోల్డ్ యాక్ట్రెస్‌గా పేరుగాంచింది. తెలుగులో బాలయ్య సరసన రెండు సినిమాల్లో నటించింది. కబాలిలో రజనీకాంత్ భార్యగా మెప్పించింది. తాజాగా మరో టాపిక్‌ను వెలుగులోకి తెచ్చింది. దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్లను పడక గదికి రమ్మని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉందని రాధికా ఆప్టే కామెంట్ చేసింది.
 
తనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. కథా చర్చలకు పిలిచిన ఓ నిర్మాత తనను పడక గదికి రావాలంటూ ఒత్తిడి తెచ్చాడని చెప్పింది. అయితే, తాను అంగీకరించలేదని తెలిపింది. ఈ కారణం వల్లే తనకు దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు తనకు రాలేదని చెప్పుకొచ్చింది. దక్షిణాది సినీ పరిశ్రమ వరస్ట్ అంటూ చెప్పుకొచ్చింది.