బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (11:22 IST)

4జీ నెట్‌వర్క్ లభ్యత విషయంలో భారత్ ముందున్నా.. డౌన్లోడింగ్ స్పీడ్‌లో పరమచెత్తగా వుందట..

దేశ వ్యాప్తంగా 4జీతో జియో సంచలనం సృష్టించింది. అయితే జియో సిమ్‌ను ఎవ్వరూ తొలి సిమ్‌గా వాడట్లేదని సర్వేలో తేలింది. జియో దెబ్బకు పోటీ పడి టెలికాం సంస్థలు 4జీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా 4జీతో జియో సంచలనం సృష్టించింది. అయితే జియో సిమ్‌ను ఎవ్వరూ తొలి సిమ్‌గా వాడట్లేదని సర్వేలో తేలింది. జియో దెబ్బకు పోటీ పడి టెలికాం సంస్థలు 4జీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా 4జీ నెట్‌వర్క్ లభ్యత విషయంలో భారత్ ముందున్నప్పటికీ.. స్పీడ్ విషయంలో మాత్రం పరమ చెత్తగా వుందని రీసెర్చ్ వెబ్‌సైట్ ఓపెన్ సిగ్నల్ డాట్ కామ్ తెలిపింది. 
 
4జీ స్పీడ్ లభ్యత విషయంలో దక్షిణ కొరియా 96.4 శాతం అగ్రస్థానంలో ఉండగా, జపాన్ (93.5 శాతం), నార్వే (87.0 శాతం), అమెరికా (86.5 శాతం), ఇండియా (81.6శాతం)  తర్వాతి స్థానాల్లో నిలిచాయి. శ్రీలంక చివరి స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ తర్వాతి స్థానాల్లో యూకే, జర్మనీ, ప్రాన్స్, ఐర్లాండ్, ఈక్వెడార్‌లు నిలిచాయి. 
 
అలాగే 4జీ లభ్యత విషయంలో చాలా దేశాల కంటే భారత్ మెరుగ్గా వున్నా, డౌన్‌లోడింగ్ వేగంలో మాత్రం చెత్తగా వుంది. డౌన్‌లోడింగ్ స్పీడ్‌లో సింగపూర్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా భారత్ మాత్రం దానికంటే తొమ్మిదిరెట్లు తక్కువగా ఉంది.