శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 7 జులై 2021 (18:51 IST)

బాలీవుడ్‌ను ఆక‌ర్షించిన `గ‌ని`

Varunthej
మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల్లో వ‌రుణ్‌తేజ్ త‌న‌కంటూప్ర‌త్యేక గుర్తింపు పొందాడు. ఫిదా, ఎప్‌2 సినిమాలు ఆయ‌న‌కు మ‌రింత పేరు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఎఫ్‌3 సినిమా చేస్తున్నాడు. దీనితోపాటు `గ‌ని` సినిమా కూడా ర‌న్నింగ్‌లో వుంది. ఇందులో బాక్స‌ర్‌గా ఆయ‌న క‌నిపించ‌నున్నాడు. ఇందుకు జిమ్ లో తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇటీవ‌లే ఆయ‌న జిమ్‌లో వున్న ఫొటోలు, బాక్సింగ్ కోసం చేస్తున్న క‌స‌ర‌త్తులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి బాలీవుడ్‌ను ఆక‌ర్షించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం బాలీవుడ్‌లో ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది.
 
వ‌రుణ్‌తేజ్ ఆహార్యం, ఫిజిక్ ను చూసిన ఓ నిర్మాత సినిమా తీయ‌డానికి ముందుకు వ‌చ్చాడ‌ట‌. అడివి శేష్ తో ‘మేజర్’ సినిమాను నిర్మిస్తున్న సోని పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతోందని తెలుస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే అల్లు అర్జున్‌కు కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో ఆద‌ర‌ణ వుంది. తెలుగులోని ఆయ‌న న‌టించిన సినిమాలు బాలీవుడ్‌లో డ‌బ్ అవుతాయి. తెలుగు వారున్న ప్రాంతాల్లో అవి తెగ ఆద‌ర‌ణ పొందుతాయి. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్ కూడా ఆ రూటులో వెళ్ళ‌నున్నాడు.