శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 3 జులై 2021 (18:56 IST)

బ్రేకింగ్ న్యూస్, పెళ్లి రద్దు చేసుకున్న F3 నటి మెహ్రీన్ పిర్జాదా

నటి మెహ్రీన్ పిర్జాదా మార్చి 12న జైపూర్‌లోని భవ్యా బిష్ణోయితో తన కుటుంబం, స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఈ జంట వివాహం చేసుకోవాలని యోచిస్తోంది. అయితే మహమ్మారి కారణంగా పెళ్లి వాయిదా వేసినట్లు మెహ్రీన్ ఇటీవల ప్రకటించారు.
 
అయితే అనూహ్యంగా శనివారం నాడు ఆమె సంచలన ప్రకటన చేసింది. భవ్యా బిష్ణోయ్‌తో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. “భవ్య బిష్ణోయ్, నేను మా నిశ్చితార్థాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇది స్నేహపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. నా హృదయంలో గౌరవంతో నేను చెప్పాలనుకుంటున్నాను, ఇప్పటి నుండి నాకు భవ్య బిష్ణోయ్, అతని కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో సంబంధం లేదు ”అని మెహ్రీన్ కౌర్ రాశారు.
 
"ఇది నేను చేస్తున్న ఏకైక ప్రకటన. ఇది చాలా ప్రైవేట్ విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ నా గోప్యతను గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను. నేను నా సినిమాల కోసం పని చేస్తూనే ఉంటాను. నా భవిష్యత్ ప్రాజెక్టులు, ప్రదర్శనలలో నా ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను.”