బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 10 ఆగస్టు 2017 (15:24 IST)

రెండురోజుల్లో పూరి, తరుణ్‌ల అరెస్టు చేస్తారా?

డ్రగ్స్ వ్యవహారం ఇద్దరు సినీప్రముఖులను తీవ్ర ఇరకాటంలో నెట్టనుంది. డ్రగ్స్‌ను స్వయంగా విక్రయించినందుకు, డ్రగ్స్ ముఠాతో సన్నిహిత సంబంధాలు ఉన్నందుకు దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పాటు హీరో తరుణ్‌‌లను అరెస్టు చేయనున్నారనే వార్తలు ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో త

డ్రగ్స్ వ్యవహారం ఇద్దరు సినీప్రముఖులను తీవ్ర ఇరకాటంలో నెట్టనుంది. డ్రగ్స్‌ను స్వయంగా విక్రయించినందుకు, డ్రగ్స్ ముఠాతో సన్నిహిత సంబంధాలు ఉన్నందుకు దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పాటు హీరో తరుణ్‌‌లను అరెస్టు చేయనున్నారనే వార్తలు ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగుతున్నాయి. ఇప్పటికే వీరితోపాటు మరికొంతమందిని సిట్ కార్యాలయంలో విచారించిన విషయం తెలిసిందే. మిగిలిన నటీనటులు కేవలం డ్రగ్స్‌ను వాడితే వీరు మాత్రం డ్రగ్స్‌ను విక్రయించారని ఆధారాలు సిట్‌కు దొరికినట్లు సమాచారం.
 
ఒకవేళ పూరి జగన్నాథ్, తరుణ్‌ల అరెస్టు జరిగితే యావత్ సినీ పరిశ్రమల ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ డ్రగ్స్ వ్యవహారంపై చాలా సీరియస్‌గా ఉన్నారు. డ్రగ్స్‌ను కూకటి వేళ్ళతో పెకిళించాలన్న ఆలోచనలో సిఎం ఉండడంతో సిట్ అధికారులు కూడా అదే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన వారిపై ఎలాంటి కేసులు వుండవని చెప్పినప్పటికీ డ్రగ్స్ అమ్మినట్లయితే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.