గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:06 IST)

''లైగర్'' కోసం రూ.35 కోట్ల పారితోషికం తీసుకున్న రౌడీ హీరో?

LIger
రౌడీ హీరో లైగర్ సినిమా విడుదల కానుంది. లైగర్ సినిమాకు రూ.150 కోట్లు ఖర్చైనట్లు పూరీ తెలిపారు. ఇక విజయ్ పారితోషికంపై చర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం విజయ్ మూడేళ్ల పాటు కష్టపడ్డాడు. లైగర్ ముందు వరకూ విజయ్ ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకునేవాడట. 
 
కానీ లైగర్‌కు తన పారితోషికాన్ని అమాంతం పెంచేసినట్లు టాక్. ఏకంగా లైగర్‌కు రూ.20 నుంచి రూ.35 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్లు సమాచారం. 
 
అంతే కాదు ఈ చిత్రం 'ఆర్ఆర్ ఆర్', 'పుష్ప', 'కేజీఎఫ్2' స్థాయిలో హిట్ అయితే చిత్ర నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్‌తో కలిసి విజయ్ లాభాల్లో వాటా కూడా పంచుకునే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. శివ నిర్మాణ దర్శకత్వంలో 'ఖుషీ' చిత్రంలో నటిస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే మళ్లీ పూరితో 'జన గణ మన' సెట్స్ పైకి వెళ్లనుంది.