Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వల్గర్ అంటే ఏంటి... హైపర్ ఆది, రైజింగ్ రాజు

'జబర్దస్త్'... ప్రతి గురు, శుక్రవారమైతే చాలు బుల్లితెరప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయి మరీ కూర్చుంటారు. గంటపాటు ఆ కార్యక్రమాన్ని తథేకంగా చూస్తూ కడుపుబ్బ నవ్వుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్‌లో వల్

Written By tj
Updated: బుధవారం, 5 జులై 2017 (12:59 IST)
'జబర్దస్త్'... ప్రతి గురు, శుక్రవారమైతే చాలు బుల్లితెరప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయి మరీ కూర్చుంటారు. గంటపాటు ఆ కార్యక్రమాన్ని తథేకంగా చూస్తూ కడుపుబ్బ నవ్వుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్‌లో వల్గర్ ఎక్కువవుతోంది. మహిళలు అస్సలు చూడడం లేదు.. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. 
 
కొంతమందైతే జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రసారం చేయద్దంటూ సూచనలు ఇచ్చారు. అయితే ఎన్ని జరుగుతున్నా ఆ కార్యక్రమం మాత్రం ఆపలేదు అందులోని కమెడియన్లకు మాత్రం మంచి పేరు వస్తోంది. తిరుపతిలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన హైపర్ ఆది మీడియాతో మాట్లాడారు.
 
జబర్దస్త్ ఈ మధ్య వల్గర్‌గా తయారైందంటే ఆయన ఏ మాత్రం ఒప్పుకోలేదు. అస్సలు వల్గర్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇప్పుడు జబర్దస్త్ చూసే వారు మరింత ఎక్కువయ్యారని, తమను ఆదరించే ప్రేక్షకుల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
అంతేకాదు జబర్దస్త్ తర్వాత తనకు సినిమాల్లో కూడా అవకాశం వచ్చిందని, మూడు సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నట్లు హైపర్ ఆది తెలిపారు. హైపర్ ఆది టీంలో తానుండడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు రైజింగ్ రాజు. ఆడవేషంలో తనకు వస్తున్న రెస్పాన్స్ అంతా కాదంటున్నారాయన. జబర్దస్త్‌లో నటించడం వల్లనే తమకు ఇంత పేరు వచ్చిందని సంతోషంగా చెబుతున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments