శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (13:09 IST)

అమలాపాల్ మాజీ భర్తకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్వీటీ

స్వీటీ అనుష్క మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇన్నాళ్ల పాటు పెద్దగా సినిమాలు చేయని అనుష్క.. తాజాగా యూవీ క్రియేషన్స్ సినిమాను అధికారికంగా ప్రకటించింది. అనుష్కకు ఇది 48వ సినిమా. యూవీ క్రియేషన్స్‌లో అనుష్క మిర్చి, భాగమతి సినిమాలు చేసింది. ఈ సినిమా కూడా చేస్తే హ్యాట్రిక్ సినిమా కానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ బోలిశెట్టి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క కోలీవుడ్‌లో సినిమాకి ఓకే చెప్పింది. కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో నాన్న సినిమాకు అనుష్క పని చేసింది. 
 
ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాలో నటించింది. ఏఎల్ విజయ్ ఎవరో కాదు అమలాపాల్ మాజీ భర్త అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్‌తో ఆమె చేసే సినిమా కూడా మంచి ప్రయోగాత్మక సినిమా అని టాక్ వస్తోంది.