మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 13 సెప్టెంబరు 2018 (10:17 IST)

చిట్టి ఈజ్ బ్యాక్.. 'లకలక స్థానంలో కుక్కురు'... #2Point0Teaser

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్‌స్టార్ అక్షయ్ కుమార్‌లు హీరో, విలన్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం '2.O'. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను వినాయకచవితి పండగ సందర్భంగా రిలీజ్ చేశారు. '

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్‌స్టార్ అక్షయ్ కుమార్‌లు హీరో, విలన్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం '2.O'. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను వినాయకచవితి పండగ సందర్భంగా రిలీజ్ చేశారు. 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్. టీజర్‌లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటున్నాయి.
 
ఒక్కసారిగా ఫోన్లన్నీ మాయమైపోతున్న సన్నివేశాలతో టీజర్‌ మొదలైంది. ఓ వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు ఉన్నట్టుండి లేచి చూడగానే కోట్లాది ఫోన్ల మధ్యలో ఉండడం చూసుకుని జడుసుకుంటాడు. ఆ సమయంలో పైనుంచి భీకరమైన ముఖంతో అక్షయ్‌ కుమార్‌ ఎంట్రీ అదిరిపోయింది. శంకర్‌ ముందు నుంచీ వీఎఫ్‌ఎక్స్‌ కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతోందని చెప్తున్నారు. ఆలస్యమైనప్పటికీ ఓ అద్భుతమైన టీజర్‌ను అందించారు.
 
భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో అత్యధిక భాగం వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే ఖర్చు చేశారు. హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం 75 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారట. అంటే మన కరెన్సీలో రూ.540కోట్లు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 3 వేల మంది నిపుణులు దీని కోసం పనిచేశారు. ఇక ప్రచారానికీ భారీగానే ఖర్చు చేస్తున్నారు.
 
ఇకపోతే, చంద్రముఖి సినిమాలో 'లకలక' అంటూ ఆకట్టుకున్న రజినీ... ఈ సినిమాలో కూడా 'కుక్కురు' అంటూ తనదైనశైలిలో పలుకుతూ కేక పుట్టించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.