శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:31 IST)

జనసేన తొలి అభ్యర్థి ప్రకటన.. సీటు ఎవరికిచ్చారో తెలుసా?

రాష్ట్ర రాజకీయాలను శాసించే తూర్పుగోదావరి జనసేన పార్టీకి వేదికైంది. కులలాను కలిపే ఆలోచన విధానం అంటూ పార్టీ ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానిక ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని వర్గాలను కలిపే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయాలను శాసించే తూర్పుగోదావరి జనసేన పార్టీకి వేదికైంది. కులలాను కలిపే ఆలోచన విధానం అంటూ పార్టీ ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానిక ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని వర్గాలను కలిపే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటివరకూ అభ్యర్ధులను ప్రకటించని జనసేనాని మంగళవారం సంచలన ప్రకటన చేశారు. 
 
అత్యధికంగా కాపు సామాజికవర్గం ఉన్న కోనసీమలో ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బిసి సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణను ప్రకటించారు. పితాని బాలకృష్ణ కానిస్టేబుల్‌గా పనిచేసి వాలంటిరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లో అడుగుపెట్టారు. తన తండ్రి కానిస్టేబుల్ అని జనసేన తొలి అభ్యర్థి కానిస్టేబుల్ కావడం విశేషం అని పవన్ కళ్యాణ్ వాఖ్యానించారు. పార్టీ  తొలి అభ్యర్థిని తూర్పుగోదావరి నుంచి ప్రకటించడం... అదీ ఓ బిసి అభ్యర్థికి దక్కడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొని ఉంది.