బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 1 మే 2017 (09:31 IST)

హిందీ బాహుబలి2 కి తగ్గని కలెక్షన్లు.. రెండో రోజూ 40 కోట్ల వసూళ్లు, ఆదివారం 48 కోట్లా?

భాహుబలి విజయయాత్ర కొనసాగుతోంది. రెండేళ్లు ఒక ప్రశ్నతో యావత్ ప్రపంచాన్ని ఊగించి ఎదురు చూసేలా చేసిన బాహుబలి 2 హిందీ ప్రాంతాల్లో తగ్గని కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి రోజు అంటే శుక్రవారం 41 కోట్లు సాధించి షాక్ కలిగించిన హిందీ బాహుబలి 2 శనివారం 40 కోట్

భాహుబలి విజయయాత్ర కొనసాగుతోంది. రెండేళ్లు ఒక ప్రశ్నతో యావత్ ప్రపంచాన్ని ఊగించి ఎదురు చూసేలా చేసిన బాహుబలి 2 హిందీ ప్రాంతాల్లో తగ్గని కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి రోజు అంటే శుక్రవారం 41 కోట్లు సాధించి షాక్ కలిగించిన  హిందీ బాహుబలి 2 శనివారం 40 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టింది. ఈ లెక్కన మూడోరోజైన ఆదివారం నాటికి హిందీ బాహుబలి2 సులభంగా వందకోట్ల వసూళ్లను చేరుకుంటుందిని అంచనా.


హిందీ ప్రాంతంలో ఒక దక్షిణాది దర్శకుడు నిర్మించిన చిత్రం స్ట్రెయిట్ చిత్రాలకంటే మిన్నగా వసూళ్ల వర్షం కురిపించడం అద్భుతాల్లోకెల్లా అద్భుతమని బాలీవుడ్ సినీ ట్రేడ్ అనలిస్టులు  ప్రశంసిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏ సినిమాకూ లేనట్లుగా  ఉత్తరాదిలో 95 శాతం సీట్ల ఆక్యుపెన్సీతో థియేటర్లు నిండిపోవడం కారణగా బాహుబలి కలెక్షన్లు వారాంతం తర్వాత కూడా తగ్గబోవని అంచనా వేస్తున్నారు. తొలిరోజున దేశవ్యాప్తంగా 121 కోట్లను వసూలు చేసిన బాహుబలి2 బాలీవుడ్ బాద్‌షాలుగా పేరోందిన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ కాన్‌ల సినిమాల కలెక్షన్ల చరిత్రను సునామీలాగ ఊడ్చి పారేసింది. 
 
హిందీ బాహుబలి2 రెండో రోజు (శనివారం) కలెక్షన్ల వివరాలు
బాహుబలి హిందీ వెర్షన్ రెండో రోజు కలెక్షన్ల వసూలు 40 కోట్లని అంచనా. తొలిరోజుతో పోలిస్తే ఏమాత్రం వసూళ్లు తగ్గలేదు. ఈ అసాధారణ విజయంతో హిందీ బాహుబలి రెండు రోజుల్లో 81 కోట్ల రూపాయలు సాధించింది. మూడో రోజు అంటే ఆదివారం హిందీ బాహుబలి 2 అవలీలగా వంద కోట్ల రూపాయల కలెక్షన్‌ను దాటుతుందని ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా అంటున్నారు. ఇప్పటికే వచ్చిన అనధికారిక అంచనా ప్రకారం హిందీ బాహుబలి 2 మూడో రోజు అంటే ఆదివారం 48 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది.
 
Ramesh Bala ✔ @rameshlaus
#Baahubali2 's Hindi version Day 2 early estimates are an astounding Rs 40 cr nett.. No drops whatsoever.. Phenomenal.. 2-days Total  Rs. 81 cr
 
భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా బాహుబలి2 తుపానులాగా చెలరేగింది. ఫ్రీ బుకింగ్స్, తొలి రోజు కలెక్షన్ల పరంగా హాలీవుడ్ సినీమాలను కూడా బాహుబలి2 తోసిపారేసింది. ఇది ఒక తెలుగు, భారతీయ చిత్రం సాధించిన అద్భుతం అనే చెప్పాలి. 
 
భారత చలన చిత్ర చరిత్రలో అనితర సాధ్య విజయం సాధించిన బాహుబలి2 పట్ల ఇంత స్పందన జనంలో కలగడానికి కారణం ఏమిటి? వై కట్టప్పా కిల్డ్ బాహుబలి? ఈ ప్రశ్నే జనాలను థియేటర్లలోకి లాగుతోంది. తెలిరోజే ఈ రహస్యం తెలిసిపోయినా కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడో నేరుగా పోయి తెలుసుకుందామనే ఒకే ఒక కారణంతో జనం థియేటర్లకు వరుస కడుతున్నారు.