శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (20:30 IST)

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

monkey
సాధారణంగా ఏదైనా తుంటరి పని చేస్తే.. కోతి పనులు ఎందుకు చేస్తావని అంటారు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలోని ఖాగీపుర్ సద్వా గ్రామంలో మాత్రం ఓ కోతి ఇలాంటి తుంటరి పనులు చేస్తూ కనిపిస్తుంది. ఆకాశ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఓ వానరం.. మనిషి చేసే అన్ని పనులను చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఇంట్లోని పాత్రలు శుభ్రం చేయడం దగ్గరి నుంచి మసాలాలు రుబ్బడం వంటి పనులను చేస్తూ తాను కోతి కాదని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
 
ఎనిమిదేళ్ల క్రితం ఇంటికి వచ్చిన కోతికి.. ఆకాశ్ కుటుంబసభ్యులు అన్నం పెట్టడంతో అప్పటి నుంచి వారింట్లోనే ఉంటోంది. దానికి వారు రాణి అని పేరు పెట్టి, ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇంట్లో మహిళలు ఏ పని చేస్తే ఆ పనులను చేయడాన్ని రాణి మెల్లగా నేర్చుకుంది. ఎవరైనా చపాతీలు లేదా రొట్టెలు కాల్చుతుంటే రాణి వాటిని చుట్టడం చేస్తుంది. ఇంట్లోని చిన్నపిల్లలకు బాడీ గార్డుగా కూడా విధులు నిర్వర్తిస్తుందోయ్. ఆ గ్రామంలోని ప్రతీ కుటుంబమూ రాణికి బంధువుల్లా మారిపోయింది. ఈ కోతి చేసే వింత పనులకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.