బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (13:35 IST)

పాటల కార్యక్రమంలో పాడుతా తీయగా సరికొత్త రికార్డ్

SP Charan, Chandra Bose, Sunitha, Vijay Prakash
SP Charan, Chandra Bose, Sunitha, Vijay Prakash
పాటల కార్యక్రమంలో సుధీర్ఘంగా నడిచిన షోగా పాడుతా తీయగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 23 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక 24వ సీజన్ త్వరలోనే ప్రసారం కానుంది. పాటల పోటీల కార్యక్రమంలో పాడుతా తీయగా షోకు సపరేట్ ట్రాక్ రికార్డ్, సపరేట్ క్వాలిటీ ఉంటుంది. ఇది 1996లో ప్రారంభమైంది. త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకల్ని జరుపుకోనుంది. ఈటీవీ పుట్టిన ఈ 30 ఏళ్లలో పాడుతా తీయగా షోకు విడదీయలేని బంధం ఉంది. ఇప్పటి వరకు పాడుతా తీయగా షోలో 500కి పైగా కంటెస్టెంట్లు పాల్గొన్నారు.
 
పాడుతా తీయగా షో మీద స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెరగని ముద్ర వేశారు. ఆయన ఇచ్చిన సూచనలు, పంచిన సంగీత జ్ఞానం, చెప్పిన విలువైన పాటలు ఈ షోను తెలుగు వారందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా చేశాయి.  ఇక ఇప్పుడు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఈ షోకు హోస్ట్‌గా ఉంటున్నారు. ఎస్పీబీ వారసత్వాన్ని ఆయన ముందుకు తీసుకు వెళ్తున్నారు.
 
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. సునీత, విజయ్ ప్రకాష్ వంటి ప్రముఖ సింగర్లు ఈ షోలో జడ్జ్‌లుగా ఉంటూ తమ సంగీత జ్ఞానాన్ని కంటెస్టెంట్లకు, ఆడియెన్స్‌కు పంచుతున్నారు.