చిరంజీవిని రాధిక చెంప పగులగొట్టింది.. ఎందుకంటే? : ఏ కోదండరామి రెడ్డి
'న్యాయం కోసం' చిత్ర షూటింగ్ సమయంలో హీరో చిరంజీవి చెంప పగులగొట్టే సన్నివేశం ఉండగా, హీరోయిన్ రాధిక నిజంగానే చిరంజీవి చెంప పగులగొట్టిందని దర్శకుడు ఏ కోదండరామి రెడ్డి చెప్పుకొచ్చారు.
'న్యాయం కోసం' చిత్ర షూటింగ్ సమయంలో హీరో చిరంజీవి చెంప పగులగొట్టే సన్నివేశం ఉండగా, హీరోయిన్ రాధిక నిజంగానే చిరంజీవి చెంప పగులగొట్టిందని దర్శకుడు ఏ కోదండరామి రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరో సీన్‌లో రాధికను చిరంజీవి కొట్టాలి. అతను కూడా ఆ సీన్‌లో నిజంగానే కొట్టాడు. దీంతో వీరివురి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పుకొచ్చారు.
తదుపరి చిత్రమైన 'అభిలాష'లోనూ చిరంజీవి, రాధిక నటించాల్సి వచ్చింది. దీంతో వారిద్దరు వీరిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. షూటింగ్ జరిగే స్పాట్‌లో హీరోహీరోయిన్లు ఇలా ఉండటం ఏమాత్రం భావ్యం కాదు. అందుకే నేను జోక్యం చేసుకుని వారిద్దరికి నచ్చచెప్పి చూశాను. దీంతో తమ ఇగోలను వదిలారు. ఫలితంగా ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిందని దర్శకుడు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.
అలాగే, తాను చిరంజీవితో 27 సినిమాలు చేశాను. మాది హిట్ కాంబినేషన్. ఇపుడు అవకాశం వస్తే మాత్రం కామెడీ సినిమానే చేస్తాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఈ వయసులో ఆయన సందేశాలు ఇచ్చే సినిమాలు తీస్తే రాజకీయ అభిమానులకు నచ్చుతుందేగాని, సినీ అభిమానులకు అంతగా నచ్చదని చెప్పుకొచ్చారు.