ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (13:24 IST)

నాకు తిండి కూడా పెట్టని నిర్మాతలున్నారు.. మూడు రోజులు పస్తుండిపోయా..?

సినీ ఇండస్ట్రీలో వస్తే రా అంటే.. రాకపోతే నువ్వెవరో నేనెవరో అంటారు. తాను వస్తుంటే నిర్మాతలు చూసి చూడకుండా తప్పుకున్న సందర్భాలున్నాయని విలక్షణ నటుడు జగపతిబాబు అన్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ.. సినీ రంగంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను చెప్పుకున్నారు. 
 
ఒకటి రెండు సినిమాల తర్వాత.. డబ్బు వస్తే సరిపోయింది.. లేకుంటే నువ్వెవరో నేనేవరో అనేలా వ్యవహరిస్తారు. అసలు తనకు తిండి కూడా పెట్టని నిర్మాతలు వున్నారు. సెట్‌లో కుర్చీ ఇవ్వని ప్రొడ్యూసర్లూ ఉన్నారు. కొన్ని ఎక్స్‌పెరిమెంట్లు కూడా చేశాను. పస్తువుంటే ఏమౌతుందని మూడు రోజులు పస్తుండిపోయానని జగపతి బాబు తెలిపారు.
 
ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ పట్టుకు తిరిగేవాడిని, ఫోన్లు వస్తాయని.. ఇంట్లో అటూ ఇటూ తిరిగేవాడిని. ఓ రోజు ఇంటి గేటు ఓపెన్ అయ్యింది. ఆటోలో వెళ్తూ వెళ్తూ.. సినిమా తీద్దామనుకుంటున్నా.. నిర్మాత, దర్శకుడు, హీరో తానే అన్నాడు. మరి తన సంగతేంటి అంటే ఓ క్యారెక్టర్ అన్నారు. అప్పట్లో తానంటే అంత చులకనగా వుండేదని జగపతిబాబు చెప్పాడు.
 
అయితే డిజైనర్‌ రామ్‌ ఫొటో సెషన్‌ తనకు బాగా సహకరించింది. ఆ ఫొటో బయటికి వెళ్లడం, బోయపాటి శ్రీను ''లెజెండ్'' కోసం అడగడం జరిగాయి. వారం పది రోజులు వాళ్లు డిలే చేశారు. తనకు టెన్షన్ మొదలైంది. వాళ్లకేమో తాను విలన్‌గా చేస్తానో చేయనోనని టెన్షన్‌. మొత్తానికి వాళ్లొచ్చారు. తాను అనుకున్న దానికంటే ఎక్కువే పారితోషికం ఇచ్చారు. 
 
కేవలం తన మీదున్న అభిమానంతో అనుకున్న దానికంటే డబుల్‌గా డబ్బిచ్చారు. ''లెజెండ్‌'' సినిమా చేసేటప్పుడు అర్ధరాత్రిళ్లు లేచి ఏడ్చేసేవాడిని. తానేంటి ఇంత క్రూరంగా వుంటానా అని ఏడుపు వచ్చేది. కానీ హీరో నుంచి విలన్‌గా మారినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ లేదని.. అప్పుడే తాను ఓ నటుడిని అనే ఫీలింగ్ కలిగిందని జగపతిబాబు వెల్లడించారు.