శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (19:18 IST)

అయ్య బాబోయ్.. శిఖా చౌదరి ఎవరో తెలియదు.. ఒక్కసారి కూడా?: సూర్య

ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇదే కేసులో నటుడు సూర్యకు సంబంధం వున్నట్లు వార్తలు వచ్చాయి.


జయరామ్ హత్యకు రెండు రోజుల ముందు రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద రాకేశ్ రెడ్డిని కలుసుకున్నానని.. తన సినిమా ప్రమోషన్ కోసం డబ్బులు అవసరమైతే కలిశానన్నారు. ఓ వ్యక్తి తనను రాకేష్‌రెడ్డికి పరిచయం చేశారని తెలిపారు. 
 
డబ్బులు ఇస్తే ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇస్తానని చెప్పానన్నారు. హనీట్రాప్‌ గురించి తెలియదని పేర్కొన్నారు. ముఖ్యంగా శిఖాచౌదరి ఎవరో తనకు అస్సలు తెలియదని సూర్య తెలిపారు.

అంతేకాకుండా జయరామ్‌ను, శిఖా చౌదరిని తానెప్పుడూ చూడలేదని సూర్య స్పష్టం చేశారు. మొత్తానికి పారిశ్రామిక వేత్త జయరాం హత్యకేసుతో తనకు సంబంధం లేదని నటుడు సూర్య తేల్చి చెప్పేశారు.