డిస్ట్రిబ్యూటర్‌గా మారిన నటుడు సుహాస్

డీవీ
సోమవారం, 7 అక్టోబరు 2024 (15:46 IST)
Suhas, Sangeerthana
నటుడు సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై  హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఈ సినిమా  ద‌స‌రా సంద‌ర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది.  బందరులో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
 
సుహాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే ఈ మూవీతో డిస్ట్రిబ్యూటర్‌గా మారుతున్నా. ఓవర్సీస్‌లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నాకు ఇంత మంచి పాత్ర, సినిమాను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సంగీర్తనను చూశాక అందరూ ఆమె ఫ్యాన్స్ అవుతారు. అక్టోబర్ 12న మా చిత్రం రాబోతోంది. ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు. నవ్వుతూనే థియేటర్ బయటకు వెళ్తారు. అందరూ చూడండి’ అని అన్నారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ, సుహాస్‌ మీలో ఒకడిగా ఉండేవాడు.. మీ జిల్లా వాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు. డైరెక్టర్ సందీప్, సంగీర్తన ఇలా కొత్త వాళ్లతో దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్ కాబోతోంది. సినిమా చూసి అందరూ నవ్వుకుని బయటకు వస్తారు. అందరినీ నవ్వించేలానే చిత్రం ఉంటుంది. పండుగ రోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని చూసి అందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 

అన్నీ చూడండి

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి : సీఎం చంద్రబాబు

నేను దోషిని కాదు, అందుకే చనిపోతున్నా: నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న హరికృష్ణ సెల్ఫీ వీడియో

అన్నీ చూడండి

పరగడుపున మంచినీరు తాగుతున్నారా?

ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీ

గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు

బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?

తర్వాతి కథనం
Show comments