సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2025 (17:38 IST)

ఇప్పుడు నా చేతులు వణకడం లేదు.. మైక్ పట్టుకోగలుగుతున్నా : హీరో విశాల్ (Video)

vishal
తాను ఆరోగ్యంగా ఎంతో బాగానే ఉన్నానని హీరో విశాల్ అన్నారు. ఇపుడు నా చేతులు వణకడం లేదని, మైకును కూడా గట్టిగా పట్టుకోగలుగుతున్నానని అన్నారు. తాను నటించిన మద గజ రాజా చిత్రం ఆదివారం విడుదలైంది. దీన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి చెన్నై నగరంలో ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన థియేటర్‌కు వచ్చి మీడియాతో మాట్లాడారు. 
 
తాను ఆరోగ్యంగా ఎంతో బాగున్నానని చెప్పారు. తనకు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు.. బాగానే ఉన్నట్టు చెప్పారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నట్టు చెప్పారు. ఇప్పుడు తన చేతులు వణకడం లేదని, మైక్ కూడా సరిగా పట్టుకోగలుగుతున్నట్టు చెప్పారు. అభిమానులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని చెప్పారు.