ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (19:01 IST)

హోటల్ గది తలుపుల్ని రాత్రంతా కొట్టేవాడు.. గీతా విజయన్

Geetha Vijayan
Geetha Vijayan
1991లో చంచట్టం సినిమా లొకేషన్ విషయంలో దర్శకుడు తులసీదాస్ అసభ్యకరంగా ప్రవర్తించారని సీనియర్ నటి గీతా విజయన్‌పై ఆరోపణలు చేశారు. తన హోటల్ గది తలుపులను పదేపదే కొట్టే వారని.. ఇందుకు తాను వ్యతిరేకించడంతో.. ప్రతీకార చర్యను ఎదుర్కొన్నట్లు తెలిపారు. 
 
ఈ క్రమంలో సినిమా సెట్స్‌లో ఆమెకు సన్నివేశాలను వివరించడానికి నిరాకరించినట్లు చెప్పారు. ఇండస్ట్రీ నుంచి తప్పించేస్తానని బెదిరించాడని.. హేమ కమిటీ రిపోర్ట్‌తో ఎన్నో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. 
 
మహిళలను వేధింపులకు గురిచేసిన వారందరికీ ప్రస్తుతం భయం పట్టుకుందని చెప్పారు. వారికి తప్పకుండా శిక్ష పడుతుందని తెలిపారు. ఈ భయం అందరిలో వుండాలని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. గీతా విజయన్ దాదాపు 150 సినిమాలకు పైగా నటించారు.