బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 16 ఏప్రియల్ 2018 (20:42 IST)

నాకు ఐదేళ్లప్పుడు తెలిసినవారే అలా... అమ్మానాన్నలకు ఏం చెప్పాలి? నటి నివేదా

దేశవ్యాప్తంగా కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులు సంచలనం సృష్టిస్తున్న నేపధ్యంలో పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను, అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా తమిళ నటి నివేదా పేతురాజ్ లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. తనకు ఐదేళ్ల వయసులోనే త

దేశవ్యాప్తంగా కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులు సంచలనం సృష్టిస్తున్న నేపధ్యంలో పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను, అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా తమిళ నటి నివేదా పేతురాజ్ లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. తనకు ఐదేళ్ల వయసులోనే తనపై లైంగిక వేధింపులు చేశారని వెల్లడించింది. ఇలా లైంగిక వేధింపులకు పాల్పడేవారు తెలియని వ్యక్తులు చాలా తక్కువగా వుంటారనీ, ఎక్కువగా బంధువులు, స్నేహితులు లేదంటే ఇరుగుపొరుగువారో అయి వుంటారని తెలిపింది. 
 
తనపై ఐదేళ్ల ప్రాయంలో జరిగిన ఘటనపై తల్లిదండ్రులకు ఎలా వివరించి చెప్పాలో కూడా తెలియని వయసది. ఇలాంటి కామాంధులు ప్రతిచోటా వుంటారనీ, అందువల్ల అమ్మాయిల పట్ల వారివారి తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా వుండాలని తెలిపింది. నిజానికి ఇలాంటి విషయాలను మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ, జరుగుతున్న దారుణాలను చూసినప్పుడు పిల్లలకు దీనిపై చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా వున్నదంటూ చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపులు గుర్తుకు వచ్చినప్పుడు మగవాళ్లను చూస్తే భయమేస్తుందనీ, కానీ మగాళ్లంతా అలావుండరని కూడా తెలుసుకోవాలంటోంది.