మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 16 ఏప్రియల్ 2018 (14:36 IST)

శ్రీరెడ్డి సెల్ ఫోనుకు 10 లక్షల మెసేజ్‌లు.. ఏమనో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో ఛాన్సులు లేకుండా పోవడం, కనీసం గుర్తింపు కార్డు కూడా లభించకపోవడంతో ఆవేదనకు లోనై అర్థనగ్నంగా ఫిలిం సొసైటీ ముందే ఆందోళనకు దిగారు నటి శ్రీరెడ్డి. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. స్వయంగా మానవ హక్కుల కమిషన్ శ్రీర

తెలుగు సినీ పరిశ్రమలో ఛాన్సులు లేకుండా పోవడం, కనీసం గుర్తింపు కార్డు కూడా లభించకపోవడంతో ఆవేదనకు లోనై అర్థనగ్నంగా ఫిలిం సొసైటీ ముందే ఆందోళనకు దిగారు నటి శ్రీరెడ్డి. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. స్వయంగా మానవ హక్కుల కమిషన్ శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించింది. దీంతో శ్రీరెడ్డికి అండగా నిలబడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒకరిద్దరు కాదు శ్రీరెడ్డి ఫోనుకు 10 లక్షల మందికిపైగా యువత సందేశాలు పంపించారట.
 
మీరు చేసింది కరెక్టే. తెలుగు సినీపరిశ్రమలో ఎంతోమంది బాధలు పడుతున్నారు. ఆ బాధలను చాలామంది బయటకు చెప్పలేకపోతున్నారు. మీరు ధైర్యంగా వచ్చి బయటకు చెప్పడం సంతోషంగా ఉంది. మీ ధైర్యం, తెగువ నిజంగా నేటి మహిళలకు ఎంతో అవసరం. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 
 
మీకు అవకాశాలు కూడా ఇబ్బడిముబ్బడిగా వస్తాయంటూ ఆమె సెల్‌ ఫోన్, వాట్సాప్, ఫేస్ బుక్‌లకు యువత మెసేజ్‌లు పంపిస్తున్నారట. అధికంగా మహిళలే ఈ మెసేజ్‌లు పంపిస్తున్నట్లు శ్రీరెడ్డి చెబుతోంది. తనకు ఇంతమంది అండగా నిలబడటం సంతోషంగా ఉందంటోంది శ్రీరెడ్డి.