శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (12:41 IST)

నాకు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదురుకాలేదు : పూజా హెగ్డే

సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై పలువురు హీరోయిన్లు ఇటీవలి కాలంలో ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. తాజాగా నటి శ్రీరెడ్డి పలువురు సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో నటి పూజా హెగ్డ

సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై పలువురు హీరోయిన్లు ఇటీవలి కాలంలో ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. తాజాగా నటి శ్రీరెడ్డి పలువురు సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో నటి పూజా హెగ్డే కూడా స్పందించారు.
 
తనకు ఇంతవరకు సినీ పరిశ్రమలో తనకు లైంగిక వేధింపులు ఎదురుకాలేదని... కానీ, వాటిని ఎదుర్కొన్నవారు తమ అనుభవాలను చెబుతుంటే చాలా బాధ కలుగుతుందన్నారు. సినీ ఇండస్ట్రీలోకి అనేక మంది అనేక కారణాలతో వస్తుంటారన్నారు. కొందరు డబ్బు సంపాదన కోసం కొందరు, నటన మీద ఇష్టంతో మరికొందరు వస్తుంటారని... అలాంటివారిని వేధింపులకు గురి చేయడం దారుణమని అభిప్రాయపడింది. 
 
లైంగిక వేధింపులపై గట్టిగా పోరాటం చేయాలని... అయితే అందరూ కలసి పోరాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంది. ఇది ఏ ఒక్కరో చేసే పోరాటం కాదని, అందరూ కలసి పోరాడకపోతే... ఈ వేధింపులు కేవలం వార్తలకే పరిమితమవుతాయని చెప్పుకొచ్చింది.