ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Updated : బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:47 IST)

టాలీవుడ్ శ్రీరెడ్డికి బాలీవుడ్ భామ కంగ‌న మ‌ద్ద‌తు.. కానీ ఆ రూటు సరికాదు..

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంపై పోరాటం చేస్తోన్న శ్రీరెడ్డి గురించి బాలీవుడ్‌లోను చ‌ర్చ జ‌రుగుతుండ‌డం విశేషం. ఇటీవ‌ల శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంపై పోరాటం చేస్తోన్న శ్రీరెడ్డి గురించి బాలీవుడ్‌లోను చ‌ర్చ జ‌రుగుతుండ‌డం విశేషం. ఇటీవ‌ల శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేసి సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో శ్రీరెడ్డి ఒక్క‌సారిగా జాతీయ స్ధాయిలో పాపుల‌ర్ అయ్యింది. శ్రీరెడ్డికి ఒక్కొక్క‌రు మ‌ద్ద‌తు చెబుతున్నారు. టాలీవుడ్‌లో న‌టి అపూర్వ మ‌ద్ద‌తు తెలియ‌చేస్తే... బాలీవుడ్‌లో కంగ‌న మ‌ద్ద‌తు తెలియ‌చేసింది.
 
 
అయితే... కాస్టింగ్ కౌచ్‌పై ఆమె పోరాడే విధానాన్ని కంగన తప్పు పట్టింది. కాస్టింగ్ కౌచ్ కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదని, ప్రతిపరిశ్రమలోనూ ఉందని తెలిపింది. చిత్ర పరిశ్రమలో చాలామంది అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని, తాను కూడా అలా ఇబ్బంది పడ్డదానినేనని కంగన తెలిపింది. అయితే దీనిపై పోరాటానికి అర్ధనగ్న ప్రదర్శన సరైన విధానం కాదని ఆమె అభిప్రాయపడింది. దీనికి బోలెడు మార్గాలున్నాయని చెప్పింది.
 
 జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, పోరాడుతున్న సమస్యకు ప్రచారం జరిగేలా జాగ్రత్త పడాలని సూచించింది. అర్ధనగ్న ప్రదర్శన ద్వారా పోరాటం పక్కదారి పట్టే అవకాశం ఉందని, అలాంటి అవకాశం ఇవ్వద్దని సూచించింది. అలాగే కాస్టింగ్ కౌచ్‌పై ఆమె జరుపుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని, గతంలో అన్యాయానికి గురైన మహిళలంతా ముందుకు రావాలని కంగనా పిలుపునిచ్చింది. మ‌రి.. ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.