మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (17:17 IST)

అన్యాయాన్ని అర్థనగ్నంగా తెలిపినందుకు శ్రీరెడ్డిని చంపేస్తారట... ఎవరు?

తెలుగు సినీపరిశ్రమలో తనకు జరిగిన అన్యాయాన్ని అర్థనగ్నంగా తెలియజేసిన శ్రీరెడ్డికి ప్రాణ భయం ఉన్నట్లు తెలుగు సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శ్రీరెడ్డిని మా అసోసియేషన్ వెలేయగా, ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయమని హుకుం జారీ చేశాడు. అంతేకాదు జరుగ

తెలుగు సినీపరిశ్రమలో తనకు జరిగిన అన్యాయాన్ని అర్థనగ్నంగా తెలియజేసిన శ్రీరెడ్డికి ప్రాణ భయం ఉన్నట్లు తెలుగు సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శ్రీరెడ్డిని మా అసోసియేషన్ వెలేయగా, ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయమని హుకుం జారీ చేశాడు. అంతేకాదు జరుగుతున్న విషయాన్నంతా శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ వస్తోంది. 
 
అయితే ఫేస్‌బుక్‌లోనే శ్రీరెడ్డికి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. నువ్వు నోరు ముయ్యకుంటే నిన్ను నడిరోడ్డుపై నరికేస్తామంటూ కొంతమంది పోస్టులు చేస్తున్నారు. అంతేకాదు ఆమెను వల్గర్‌గా తిడుతూ పోస్టులు చేస్తున్నారు. ఇప్పటివరకు శ్రీరెడ్డి పోస్టులు చేసిన వాటిలో ఆమెకు వచ్చిన సందేశాలలో 90 శాతం ఆమెను విమర్శిస్తూ, బెదిరిస్తూ పంపిన మెసేజ్‌లే ఎక్కువగా ఉండటంతో శ్రీరెడ్డి విస్తుపోతోంది.
 
ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న శ్రీరెడ్డి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదట. శ్రీరెడ్డి స్నేహితులు మాత్రం పోలీస్టేషనులో ఫిర్యాదు చేయాలని చెబుతున్నారట. మరి శ్రీరెడ్డి ఏం చేస్తుందో చూడాల్సి వుంది.