మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (15:28 IST)

కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పుడెందుకు లెండి.. మళ్లీ మాట్లాడుతా: కొరటాల శివ

టాలీవుడ్‌ని క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాస్టింగ్ కౌచ్ గురించి భరత్ అనే నేను సినిమా దర్శకుడు కొరటాల శివ విభిన్నంగా స్పందించారు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, కాస్టింగ్ కౌచ

టాలీవుడ్‌ని క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాస్టింగ్ కౌచ్ గురించి భరత్ అనే నేను సినిమా దర్శకుడు కొరటాల శివ విభిన్నంగా స్పందించారు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, కాస్టింగ్ కౌచ్‌పై తాను మరోసారి మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతానికి తన కొత్త చిత్రం ప్రమోషన్, విడుదల తదితరాలు తప్ప మరో ఆలోచన లేదన్నారు.
 
చెర్రీతో తన తదుపరి చిత్రం కథ గురించి ఇప్పటివరకూ ఏమీ అనుకోలేదని, చెర్రీ చేస్తున్న సినిమాలన్నీ పూర్తయ్యాక తనతో సినిమా ప్రారంభం చేస్తాడని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన ''భరత్ అనే నేను'' చిత్రాన్ని ఎవరినీ ఉద్దేశించి తీయలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ కల్పిత కథగానే దీన్ని చూడాలన్నారు.
 
ఎలాంటి వివాదాలూ రారాదనే ఉమ్మడి రాష్ట్రాన్ని చూపించామని చెప్పారు. కాగా, ఈనెల 20న భ‌ర‌త్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఓవ‌ర్సీస్‌లో ఏకంగా 2000 ప్రీమియ‌ర్లు వేస్తున్నారు.