శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 14 ఏప్రియల్ 2018 (16:30 IST)

'రెడ్డి' అనే పదం మోయడం బరువుగా వుంది.. ఇకపై నా పేరు శ్రీశక్తి : శ్రీరెడ్డి

హైదరాబాద్ నడిబొడ్డున అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి మరోమారు వార్తలకెక్కనున్నారు. తన పేరును శ్రీరెడ్డి నుంచి శ్రీశక్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

హైదరాబాద్ నడిబొడ్డున అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి మరోమారు వార్తలకెక్కనున్నారు. తన పేరును శ్రీరెడ్డి నుంచి శ్రీశక్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ రోజు నేను ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నాను.. అదేంటంటే నా పేరులో 'రెడ్డి' అని ఉన్న పదాన్ని మోయడం బరువుగా అనిపిస్తోంది.. నా పేరు ఇక నుంచి శ్రీరెడ్డి కాదు శ్రీశక్తి.. నా గురించి మీడియా రాసేటప్పుడుగానీ, చదివేటప్పుడుగానీ శ్రీశక్తి అనే రాయండి, చదవండి' అని నటి శ్రీరెడ్డి విజ్ఞప్తి చేసింది.
 
అంతేకాకుండా, నిర్మాత 'దిల్‌' రాజు చేతుల్లోంచి ఎప్పుడైతే థియేటర్లు బయటకు వస్తాయో అప్పటివరకు నేను శ్రీశక్తిగానే ఉంటాను. ఎవరి దగ్గరయితే మెజారిటీ థియేటర్లు ఉండిపోయాయో వారందరి చేతుల నుంచి బయటపడాలి. నేను చేసే ఉద్యమం ఇంత ఉద్ధృతం అవుతుందని నేను ఊహించలేదు. ఇంకొంత మంది అమ్మాయిలు బయటకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఓయూ విద్యార్థులను కలుపుకువెళతాము. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా అక్కడకు వెళ్లి వారికి న్యాయం జరిగేలా చేస్తాం' అని ఆమె ప్రకటించారు.