సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 మే 2021 (09:26 IST)

అందాల ఆరబోస్తూ కవ్విస్తున్న పూనమ్ కౌర్

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు. ఈమె సమాజంలో జరిగే అన్యాయాలపైన తనదైనశైలిలో స్పందింటారు. అలాగే, తన గురించి లేదా మహిళల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని చెడుగుడు ఆడేస్తారు. 
 
ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ... హీరో పవన్ కళ్యాణ్‌పై ట్వీట్లతో చాలా పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ ఫిజికల్ ఫిట్నెస్‌పైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. 
 
తరచూ యోగ చేస్తూ ఆవీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. గతంలో ఈ ముద్దుగుమ్మ బురదలో యోగాసనాలు వేస్తూ ఆకట్టుకుంది. వంటికి మట్టి మేలు చేస్తుందని చెబుతూ ఆరోగ్యంగా ఉండటానికి యోగాసనాలు వేయాలని సూచించింది.
 
తన స్నేహితులతో కలిసి ఇలా బురదలో ఆసనాలు వేసింది. యోగా ఆగ‌స‌నాల‌లో బుర‌ద‌లో వుండ‌డం, బుర‌దలో అవ‌స‌ర‌మైతే నృత్యం చేయ‌డం వంటివి కొన్ని క్రియ‌లు చేయాలని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అందులో భాగంగా కొంద‌రు గ్రూప్‌గా ఏర్ప‌డి ముందుగా ఏర్పాటు చేసుకున్న బుర‌ద‌గుంట‌లో ఇలా విన్యాసాలు చేసారు. 
 
అందులో త‌న‌కు బాగా న‌చ్చిన భంగిమ ఇదంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తుండటంతో పూనమ్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానులను పలకరిస్తూనే ఉంది ఈ చిన్నది.