శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (10:32 IST)

నటి రేవతి బ్లాక్ మెయిల్ ఇదే ఆధార‌మంటున్న మలయాళ ప‌రిశ్ర‌మ‌

Revati
జూన్ 15న మళయాళ నటి రేవతి సంపత్  తనను మానసికంగా వేదించారంటూ 14 మంది పేర్లను విడుదల చేసి సంచలనం స్రుష్టించారు. వారిలో తెలుగు డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ పేరుతో పాటు, నటుడు సిద్దిఖ్, సిజ్జుల పేర్లు కూడా వున్నాయి. ఆ వార్త చిలికి చిలికి గాలివానగా మారినట్టు దీని వెనుక నటి రేవతి భారీ  ప్లాన్ చేసిందనే వార్తలు ప్రస్తుతం మళయాలం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 14 మంది పేర్లలో ఐదవ పేరులో వున్న కేరళ ఫ్యాషన్ లీగ్ వ్యవస్థాపకుడైన అఖిల్దేవ్ నటి రేవతి పన్నిన కుట్రను భగ్నం చేశారు.  కేరళ ఫ్యాషన్ లీగ్ వ్యవస్థాపకుడు అభిల్దేవ్ తన బాధను వ్యక్తం చేశాడు. 
 
మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన మీటూ ఉద్యమాన్ని బ్లాక్ మెయిలింగ్ ఉపయోగిస్తూ పబ్లిక్ ను తప్పుదోవ పట్టిస్తోంది. సాక్ష్యం, ఆధారాలు లేని  ఫేస్ బుక్ వాల్ లో వచ్చిన విచిత్రమైన న్యూస్ చూసి మా భార్య తీవ్ర మసస్థాపానికి గురైంది. ఆమె పడే మానసిక బాధను అర్థం చేసుకొని రేవతి ఫేస్ బుక్ ఆధారంగా ఆమె చదివిన కాలేజి  గురించి ఎంక్వయిరీ చేయగా, చైనా లోని వైఫాంగ్ విశ్వవిధ్యాలయంలో మెడిసెన్ చదివేది. అప్పుడు సహ విద్యార్థనీల నగ్న వీడియోలు తీసి వాళ్లను బ్లాక్ మెయిల్ చేసేది. అది తెలుసుకొని క్లాస్ మేట్స్ అందరూ కంప్లైంట్ చేయగా ఆమెను, ఆమె సహచరుడిని వైఫాంగ్ విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కలిసి పెట్టిన మాస్ పిటీషన్ కూడా ఆధారంగా మీ ముందు వుంచుతున్నాను.  అంటూ ఆధారాలను బయటపెట్టాడు.
college letter
 స్త్రీ హక్కుల గురించి మీటూ గురించి అనర్గళంగా మాట్లాడి ఛీప్ పబ్లిసిటీ సంపాదించుకోవాలని పరువు గల సెలెబ్రిటీలను టార్గెట్ చేసిన నటి రేవతి నిజ స్వరూపం ఇది అంటూ ఆయన చెప్పారు. ఇతరులెవరు ఆమె ఉచ్చులో పడకూడదనే నేను ఈ ఆధారాలను సేకరించాను‘ అన్నారు. ఆమె చేసిన నిరాధారమైన ఆరోపణలకు నాతో పాటు మిగిలిన 13 మంది కూడా ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. పాత్రికేయులు కూడా దయచేసి సోషల్ మీడియాలో వచ్చే నిరాధారమైన పోస్ట్ లకు ప్రాముఖ్యత ఇచ్చి మా కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయద్దు అని ప్రాధేయపడ్డారు. అంతే కాకుండా మరికొందరికి కాల్ చేసి పేరు ఉపసంహరించడానికి డబ్బు కూడా డిమాండ్ చేస్తోందని తెలిసింది.